CM Revanth Reddy: ఇంటెలిజెన్స్ డీజీ కుమారుడి వివాహానికి సీఎం దంపతులు..
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:30 AM
ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి కుమారుడు కార్తీక్ వివాహం అర్షితో సోమవారం రాత్రి ఘనంగా జరిగింది.
ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి కుమారుడు కార్తీక్ వివాహం అర్షితో సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు హాజరై వధూవరులను దీవించారు.
-ఆంధ్రజ్యోతి, హైదరాబాద్