Share News

CM Revanth Reddy: ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లు

ABN , Publish Date - Nov 15 , 2024 | 04:03 AM

ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టిసారించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని సూచించారు.

CM Revanth Reddy: ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లు

  • హోంగార్డుల తరహాలో వారికి జీతభత్యాలు: రేవంత్‌

  • విధివిధానాలు రూపొందించాలని ఆదేశం

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టిసారించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని సూచించారు. హైదరాబాద్‌లో సిగ్నల్‌ జంపింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారిని నిరోధించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.


డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లోనూ వారి సేవలను వాడుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. తద్వారా తాగి వాహనాలు నడిపే వారి సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. హోంగార్డుల తరహాలో వారికి జీతభత్యాలు సమకూర్చేలా విధివిధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు గురువారం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Nov 15 , 2024 | 04:03 AM