CM Revanth Reddy: నదులను కబళిస్తే.. మనుగడే ప్రశ్నార్థకం
ABN , Publish Date - Nov 22 , 2024 | 03:09 AM
నదులను కబళిస్తే.. మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, నదుల వెంట నాగరికత వర్ధిల్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పటిష్ఠ ఆర్థికం, పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలే తప్ప శాపంగా మిగిలిపోకూడదని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌కు మూసీ వరం కావాలి..శాపం కాదు
ప్రక్షాళనకు అండగా నిలిచే వారందరికీ ధన్యవాదాలు
‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్యాగ్ చేస్తూ..సీఎం రేవంత్ పోస్ట్
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): నదులను కబళిస్తే.. మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, నదుల వెంట నాగరికత వర్ధిల్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పటిష్ఠ ఆర్థికం, పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలే తప్ప శాపంగా మిగిలిపోకూడదని అభిప్రాయపడ్డారు. మూసీని ప్రక్షాళన చేయాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పం.. తరతరాలకు మేలు చేసే నిర్ణయమని పేర్కొన్నారు. ఆ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికీ, ప్రతీ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘చెరువుల ఆక్రమణను ఉపేక్షిస్తే విధ్వంసమే’’ అనే శీర్షికన గురువారం ‘‘ఆఽంధ్రజ్యోతి’’లో ప్రచురితమైన కథనాన్ని ట్యాగ్ చేస్తూ, సీఎం రేవంత్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.