CM Revanth Reddy: పేదల పెన్నిధి పీజేఆర్: సీఎం రేవంత్
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:50 AM
పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన వ్యక్తి దివంగత మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన వ్యక్తి దివంగత మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పీజేఆర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ నేతగా పని చేసిన పీజేఆర్.. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడారని, తెలంగాణ వాదానికి గొంతుకగా నిలిచారని సీఎం గుర్తు చేశారు.