Share News

CM Revanth Reddy: జనవరి 20న దావోస్‌కు సీఎం రేవంత్‌

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:48 AM

తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు.

CM Revanth Reddy: జనవరి 20న దావోస్‌కు సీఎం రేవంత్‌

  • ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు. ప్రతీ ఏటా జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం పాల్గొననున్నారు. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా పాల్గొంటారు.


ఈ సదస్సులో 50కి పైగా దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలను పేర్కొనడంతోపాటు విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌ సమావేశాల్లో ‘తెలంగాణ పెవీలియన్‌’ పేరుతో ప్రత్యేక పెట్టుబడుల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 03:48 AM