పెద్దపల్లిలో కోకా కోలా పరిశ్రమ
ABN , Publish Date - Jun 09 , 2024 | 05:12 AM
ప్రముఖ అంతర్జాతీయ శీతల పానీయాల కంపెనీ కోకా కోలా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆ కంపెనీ ప్లాంట్ ఉండగా.. విస్తరణలో భాగంగా పెద్దపల్లిలో రూ.700 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ అంతర్జాతీయ శీతల పానీయాల కంపెనీ కోకా కోలా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆ కంపెనీ ప్లాంట్ ఉండగా.. విస్తరణలో భాగంగా పెద్దపల్లిలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం కోకా కోలా గ్రూప్ డైరెక్టర్ జోనథన్ రీఫ్‌తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పరిశ్రమలు పెట్టాలని కంపెనీని ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన జోనథన్.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ఎక్స్‌లో ప్రకటించారు.