Home » Peddapalli
రామగుండం కమిషరేట్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు వెంటనే వెళ్లిపోవాలని, లేకపోతే తానే వెళ్లగొడతానని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు.
యాసంగి సీజన్లో నిర్ధేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొ న్నారు.
మండలంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం కన్నాల, జీడినగర్, బసంత్‌నగర్, జయ్యా రం, గుడిపెల్లి, పుట్నూర్ గ్రామాల్లో జరుగుతున్న పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు ఉన్నా యని రామగుండం ఎంఈవో గడ్డం చంద్రయ్య అన్నారు. ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్‌లో భాగంగా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలను గురువారం సందర్శిం చారు.
ప్రభుత్వ గురుకులాలో చదివే బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రంగంపల్లి కాలనీలో ఉన్న మహాత్మాజ్యోతిభాపూలే బీసీ బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు.
యువత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వీ హబ్ సహకారం అందిస్తుం దని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్లో విద్యార్థులకు నిర్వహిం చిన ఐడియేషన్ బూట్ క్యాంపులో పాల్గొ న్నారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాజ్ చేసే ధోరణి నుంచి జాబ్‌లు సృష్టిం చాలనే లక్ష్యాలు నిర్ధేశించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
రామగుండం పునర్ నిర్మాణ దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని, రామగుండం నగరాన్ని బిజినెస్, మెడికల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం మెయిన్ చౌరస్తాలో సింగరేణి ఆధ్వర్యంలో రూ.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ప్రభుత్వం ఏర్ప డితే రెండు రోజుల్లోనే ఇసుక లారీలను నిలిపివేస్తా మని ఇచ్చిన మాటాను మంత్రి మరిచారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకేషిరవీందర్ ప్రశ్నిం చారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇసుకను బంద్ చేస్తామని హామీఇచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇసుక లారీలు నడుస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెల ల్లోనే ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు వచ్చాయని ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు అన్నారు. సోమవారం అంకంపల్లెలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపో శారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.
చట్ట పరిధిలో పోలీసుల ను ఆశ్రయించే సామాన్యుడికి న్యాయం జరిగేలా చూస్తామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే బాధి తులు నేరుగా కలువాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అం బర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. సోమవారం రామగుండం కమి షనరేట్‌లో కమిషనర్‌గా బాధ్య తలు స్వీకరించారు. సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.