Share News

Congress: అచ్చంపేట మునిసిపల్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:34 AM

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్ల నర్సింహగౌడ్‌పై కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం నెగ్గింది. మునిసిపాలిటీ కౌన్సిలర్లకు అవిశ్వాస తీర్మానంపై ఎన్నికల అధికారి ఆర్డీవో మాధవి గత నెల 27న నోటీసులు జారీ చేశారు.

Congress: అచ్చంపేట మునిసిపల్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం

అచ్చంపేట: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్ల నర్సింహగౌడ్‌పై కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం నెగ్గింది. మునిసిపాలిటీ కౌన్సిలర్లకు అవిశ్వాస తీర్మానంపై ఎన్నికల అధికారి ఆర్డీవో మాధవి గత నెల 27న నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో అచ్చంపేట మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. మొత్తం 20 మందికి గానూ 16 మంది సభ్యులు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తారు. కాగా, మిగిలిన నలుగురు సభ్యులు చైర్మన్‌ నర్సింహగౌడ్‌తో పాటు కౌన్సిలర్లు రమేశ్‌ రావు, మనోహర్‌ ప్రసాద్‌, ఖాజాబీ గైర్హాజరయ్యారు.

Updated Date - Jun 13 , 2024 | 03:34 AM