Share News

Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

ABN , Publish Date - Oct 31 , 2024 | 05:06 AM

డ్రగ్స్‌కు సంబంధించి కాంగ్రె్‌స-బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు తెరతీశారని.. తనను డ్రగ్స్‌కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన సీఎం రేవంత్‌రెడ్డితోనే

Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

  • మీ ప్రజాప్రతినిధులతో డ్రగ్స్‌ టెస్ట్‌కు రండి

  • ముఖ్యమంత్రికి కౌశిక్‌ రెడ్డి సవాల్‌

  • సీఎం కాలిగోటికి కూడా కౌశిక్‌ రెడ్డి సరిపోడు: బల్మూరి

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌కు సంబంధించి కాంగ్రె్‌స-బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు తెరతీశారని.. తనను డ్రగ్స్‌కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన సీఎం రేవంత్‌రెడ్డితోనే తనకు పంచాయితీ అని, కాంగ్రెస్‌ నేతలతోకాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము డబ్బా పట్టుకొని సిద్ధంగా ఉన్నామని.. తనపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి డ్రగ్స్‌ టెస్ట్‌కు రావాలని సీఎంకు సవాల్‌ విసిరారు. కౌశిక్‌రెడ్డిని తాము ట్రాప్‌ చేయలేదని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎ్‌సనేత దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ వీధిరౌడీకన్నా.. అధ్వాన్నంగా రేవంత్‌రెడ్డి భాష ఉందని, దావుద్‌ ఇబ్రహీం తరహాలో మాట్లాడుతున్న ఆయన గురించి కాంగ్రెస్‌ నాయకులు ఆలోచించి గడ్డి పెట్టాలన్నారు.


హైడ్రా, మూసీ సుందరీకరణ, జీవో 46, జీఓ29, తెలంగాణ స్పెషల్‌ పోలిసింగ్‌ ఇలా అన్నింట్లోనూ సీఎంది నెగిటివ్‌ మైండ్‌సెట్‌ అని ఆరోపించారు.. రేవంత్‌ది ప్రజాపాలన కాదు.. మూర్ఖపు హిట్లర్‌ పాలన అని విమర్శించారు. కాగా తాము అపోలో ఆస్పత్రిలో డ్రగ్స్‌ టెస్ట్‌ కోసం శాంపిల్స్‌ ఇచ్చామని.. బీఆర్‌ఎస్‌ నేతలు కూడా వచ్చి పరీక్షల తాలూకు నివేదికలను ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ పేర్కొన్నారు. కేటీఆర్‌ దగ్గరి మిత్రులు డ్రగ్స్‌ తీసుకున్నారని, ఫలితంగా కేటీఆర్‌ కూడా తీసుకొని ఉంటారనే అనుమానం కలుగుతోందని, ఆయన టెస్టులు చేయించుకోవాలన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో బల్మూరి వెంకట్‌ మాట్లాడారు. సీఎం కాలిగోటికి కూడా కౌశిక్‌ రెడ్డి సరిపోరని.. నోటిని అదుపులో పెట్టుకోకుంటే ఆయన్ను బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు.

Updated Date - Oct 31 , 2024 | 05:06 AM