Share News

34 మంది ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నేర చరితులు

ABN , Publish Date - May 01 , 2024 | 06:21 AM

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న నాలుగు ప్రధాన పార్టీల నుంచి మొత్తం 53 మంది బరిలో ఉంటే.. వారిలో 34 మంది నేరచరితులేనని ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ)’ తెలిపింది

34 మంది  ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో   నేర చరితులు

16 మంది డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలున్నవారే

10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్నవారు 34 మంది: ఎఫ్‌జీజీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న నాలుగు ప్రధాన పార్టీల నుంచి మొత్తం 53 మంది బరిలో ఉంటే.. వారిలో 34 మంది నేరచరితులేనని ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ)’ తెలిపింది.

కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 12 మంది, బీజేపీలో 12, బీఆర్‌ఎస్‌ 9, మజ్లిస్‌కు చెందిన ఒక అభ్యర్థిపై కేసులు ఉన్నాయి. వీరికి సంబంధించిన పలు వివరాలను ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌ పార్టీలకు చెందిన 53 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి, వారి నేర చరిత్ర, ఆస్తులు, విద్యార్హతలను తెలుసుకున్నామని తెలిపారు.

17 స్థానాలకు మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సికింద్రాబాద్‌ నుంచి అత్యధికంగా 45 మంది పోటీ పడుతుండగా.. ఒక్కో నియోజకవర్గానికి సగటున 30 మంది పోటీలో ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు 24 మంది, గ్రాడ్యుయేట్లు 12 మంది ఉండగా.. గ్రాడ్యుయేషన్‌ కంటే తక్కువ విద్యార్హతలున్నవారు 16 మంది ఉన్నారు.

రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగినవారు కాంగ్రెస్‌ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 12 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది, మజ్లిస్‌ నుంచి ఒకరు ఉన్నారు. కాంగ్రెస్‌ ముగ్గురు మహిళలకు టికెట్లు ఇవ్వగా.. బీజేపీ ఇద్దరు, బీఆర్‌ఎస్‌ ఇద్దరికి ఇచ్చాయి.

Updated Date - May 01 , 2024 | 07:29 AM