వైద్య విధాన పరిషత్ బలోపేతానికి చర్యలు
ABN , Publish Date - Oct 23 , 2024 | 05:37 AM
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆస్పత్రుల పనితీరు, టీవీవీపీనీ సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్‌గా బలోపేతం చేయడానికి రూపొందించిన ప్రతిపాదనలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష చేశారు.
మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆస్పత్రుల పనితీరు, టీవీవీపీనీ సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్‌గా బలోపేతం చేయడానికి రూపొందించిన ప్రతిపాదనలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష చేశారు. ఆస్కీ రూపొందించిన ఈ ప్రతిపాదనలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని సూచించారు. అదనపు పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీసు విషయాల్లో సమస్యలు తలెత్తకుండా ప్రతిపాదనలు ఉండాలన్నారు. 39,980 మిలియన్ యూనిట్లుగా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి.