Sangareddy: చెరువులో భారీ భవనం కూల్చివేత
ABN , Publish Date - Sep 26 , 2024 | 02:04 PM
రాష్ట్రంలో చెరువులు, నాలాలను అక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపుతుంది. అందులోభాగంగా హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని పలు భవనాలను ఇప్పటికే హైడ్రా నేలమట్టం చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో చెరువులు, నాలాలను అక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపుతుంది. అందులోభాగంగా హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని పలు భవనాలను ఇప్పటికే హైడ్రా నేలమట్టం చేసింది. అలాంటి వేళ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కుతుబ్‌శాయి పేట గ్రామంలో అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు.
Viral Video: బికినీ వేసుకునేందుకు భార్య కోసం భర్త ఏం చేశాడంటే..
Viral Video: ట్రాఫిక్‌లో చిక్కుకున్న చుక్ చుక్ రైలు.. ఆ తర్వాత ఏమైందంటే..
స్థానిక చెరువులో నాలుగంతస్తుల భవన నిర్మాణంపై చర్యలు చేపట్టారు. అందులోభాగంగా బాంబులతో ఆ భవనాన్ని నేలకూల్చారు. ఆ క్రమంలో బాంబులు పేలి.. భవనం తాలుక శిథిలాలు ఎగిరిపడ్డాయి. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి పుష్కర కాలం క్రితం మల్కాపురం పెద్ద చెరువు పరిధిలో ఈ భవనం నిర్మించారని స్థానికులు వెల్లడించారు.
Also Read: Janasena: బాలినేని శ్రీనివాసరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
Also Read: 3D Printed Hotel: ప్రపంచంలోనే తొలి త్రీడి ప్రింటింగ్ హోటల్
నీళ్లో అడుగు పెట్టుకుండా.. భవనంలోకి వెళ్లేందుకు ఓ మార్గాన్ని సైతం నిర్మించారని వారు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో వారు.. హైదరాబాద్ నగరం నుంచి ఇక్కడి వచ్చి సేద తీరుతారని గ్రామస్తులు వివరించారు.
Also Read: Kerala: అన్నా సెబాస్టియన్ తల్లిదండ్రులను పరామర్శించిన ఎంపీ శశిథరూర్
Also Read: Gold and Silver Rates Today: చరిత్రలోనే తొలిసారి.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
For More Telangana News And Telugu News