BJP: పసుపు బోర్డుపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది.. ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు
ABN , Publish Date - Feb 20 , 2024 | 05:37 PM
కాంగ్రెస్ నేతలు పసుపు బోర్డుపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) విమర్శించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై అరవింద్ విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు పసుపు బోర్డుపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) విమర్శించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై అరవింద్ విమర్శలు గుప్పించారు.
ఎన్నికల కోసమే కాంగ్రెస్ పసుపు రైతులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. "వ్యవసాయశాఖ మంత్రిగా తుమ్మల ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. పసుపు విస్తీర్ణం తగ్గిందని మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయనకు పసుపు పంటపై అవగాహన లేదు. పసుపు బోర్డు పై కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మానుకుని.. రైతులకు మేలు చేసే పనులు చేయాలి. నిజామాబాద్‌ను రానున్న రోజుల్లో పసుపు ఎగుమతుల హబ్‌గా మారుస్తాం" అని అరవింద్ అన్నారు.