Home » Dharmapuri Arvind
ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి సంఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని, విచారణ పకడ్బందీగా జరపాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ దీక్షకు కాంగ్రెస్కు భయం పట్టుకుందన్నారు.
‘‘రేవంత్.. నీ పౌరుషం చచ్చిపోయిందా?’’ అంటూ సీఎంను ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ‘‘ఇదే ముఖ్యమంత్రిని కొడంగల్లో రాత్రి 2 గంటలకు నిద్రలేపి మరీ ఎత్తకపోయి జైలులో పెట్టిండు కేసీఆర్.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత ధర్మపురి శ్రీనివా్స(డీఎస్) అని పలువురు ప్రముఖులు కొనియాడారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. డి శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఉద్ఘాటించారు.
ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘనందనరావులు లోక్సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. హుజురాబాద్, గజ్వేల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల ఓడారు. ఇప్పుడు ఈటల మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. మెదక్ ఎంపీగా రఘనందనరావు గెలిచారు.
సీఎం రేవంత్ రెడ్డిపై.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. నేడు బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమంటూ మరోసారి అర్వింద్ స్పష్టం చేశారు. బీజేపీని తట్టుకోవటం కాంగ్రెస్తో అయ్యే పని కాదన్నారు. ఏబీవీపీ నుంచి రేవంత్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతారన్నారు.