Share News

DSC: నేటి నుంచి తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు

ABN , Publish Date - Jul 18 , 2024 | 08:52 AM

నేటి నుంచి తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5 వరకూ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు 2లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

DSC: నేటి నుంచి తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5 వరకూ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు 2లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 2017 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న డీఎస్సీ పరీక్షలు ఇవే కావడం గమనార్హం. రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4:30 వరకూ రెండో సెషన్ జరగనుంది.


ఒక్కో సెషన్ లో 13,000 మంది చొప్పున రెండు సెషన్లకు కలిపి రోజుకు 26,000 మంది డీఎస్సీ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం14 జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. 10 నిమిషాల ముందే గేట్లు పరీక్ష కేంద్రాలను అధికారులు మూసి వేయనున్నారు. బయోమెట్రిక్ కారణంగా గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు చేయడం జరిగింది. మొదటి సారి ఆన్లైన్ విధానం ద్వారా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.


డీఎస్సీని నిలిపివేయాలంటూ పిటిషన్..

మరోవైపు పది మంది నిరుద్యోగులు కొందరు డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు, నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్‌లో నిరుద్యోగులు పేర్కొన్నారు. ప్రిపరేషన్‌కు తగిన సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని పిటిషన్‌లో నిరుద్యోగులు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో జస్టిస్ పుల కార్తీక్ బెంచ్ విచారణ నిర్వహించనుంది.

దూరం.. దూరం!

Read more Telangana News and Telugu News

Updated Date - Jul 18 , 2024 | 09:30 AM