త్వరలో మీ సేవ ఆపరేటర్ల కమీషన్ పెంపు
ABN , Publish Date - Oct 23 , 2024 | 05:51 AM
మీసేవ ఆపరేటర్ల కమీషన్ పెంపుపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, త్వరలో కొత్త కమీషన్ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మీసేవ ఆపరేటర్ల కమీషన్ పెంపుపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, త్వరలో కొత్త కమీషన్ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బైర శంకర్, మొహమ్మద్ మోయీద్ మంగళవారం మంత్రిని కలిసి సమస్యలు ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 వేల మీసేవ కేంద్రాల్లో 3 వేలకు పైగా కేంద్రాల నెలవారీ కమీషన్ రూ.5వేలలోపు ఉందన్నారు. మీసేవల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నా తక్కువ కమీషన్‌తో ఆపరేటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో అనేక కేంద్రాలు మూతపడ్డాయన్నారు.