Home » Duddilla Sridarbabu
రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
సభ ప్రారంభంకాగానే కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీటులో కూర్చున్నారు. విషయాన్ని గుర్తించిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని..
మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న వారికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.మూసీని అభివృద్ధి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు.
లగచర్లలో కలెక్టర్, ఉన్నతాధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.
తెలంగాణ ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మలేషియా దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు.
వరుసగా తెలంగాణలో చోరీలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఉండే రాజకీయ నాయకుల ఇంట్లోనే చోరీలు జరగడంతో సామాన్యల పరిస్థితి ఎంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈచోరీ విషయం స్థానికులకు తెలియడంతో వారు భయాభ్రాంతులకు గురవుతున్నారు. దొంగలను పట్టుకుని రక్షణ కల్పించాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
Telangana: జగిత్యాల జిల్లాలో జరిగిన హత్య ఉదంతంపై మంత్రి శ్రీధర్ బాబు రెస్పాండ్ అయ్యారు. హత్య చేసిన, చేయించిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని వెల్లడించారు.
మీసేవ ఆపరేటర్ల కమీషన్ పెంపుపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, త్వరలో కొత్త కమీషన్ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
ఆవిష్కరణలతో పాటు వర్ధమాన సాంకేతికతల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.