Kavitha Arrest live Updates: తన అరెస్టుపై తొలిసారి స్పందించిన ఎంఎల్సీ కవిత.. జైలా? బెయిలా?.. ఒకటే ఉత్కంఠ
ABN , First Publish Date - Mar 16 , 2024 | 10:53 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
Live News & Update
-
2024-03-16T12:35:49+05:30
కవితను 10 రోజులు కస్టడీకి కోరిన ఈడీ అధికారులు
కవిత పిటిషన్ ఇంకా కోర్టులో ఉందన్న కవిత లాయర్
తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును కవిత కోరారన్న న్యాయవాది
కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ నోటీసులు ఇచ్చారు
నిన్నటి నుంచి నన్ను న్యాయవాదులతో మాట్లాడనివ్వ లేదు: ఎంఎల్సీ కవిత
-
2024-03-16T11:56:10+05:30
కవిత అరెస్ట్ కేసును విచారించనున్న సీబీఐ స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్
కవిత తరపు వాదనలు వినిపించనున్న న్యాయవాదులు విక్రమ్ చౌదరి, మోహిత్ రావు
ఈడీ తరపు వాదనలు వినిపించనున్న న్యాయవాదులు ఎన్‌కే మట్టా, జోసెబ్ హుస్సేన్
-
2024-03-16T11:41:07+05:30
ఢిల్లీ లిక్కర్ కేసులో తన అరెస్ట్‌పై ఎంఎల్సీ కవిత తొలిసారి స్పందించారు. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తానని, కోర్టులోనే తేల్చుకుంటానని ఆమె అన్నారు. ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టే మీడియాతో ఆమె ఈ విధంగా మాట్లాడారు.
-
2024-03-16T11:34:41+05:30
కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
కవితను కస్టడీకి కోరనున్న ఈడీ అధికారులు
రిమాండ్ రిపోర్టును సిద్ధం చేసిన అధికారులు
-
2024-03-16T11:30:04+05:30
రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్‌పాల్ ముందు కవితను ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు
-
2024-03-16T11:17:02+05:30
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్సీ కవితను ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.
-
2024-03-16T11:15:19+05:30
రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న ఈడీ అధికారులు
కవితకు జైలుశిక్షా.. బెయిల్ లభిస్తుందా?
కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
-
2024-03-16T11:12:34+05:30
కవితను కోర్టుకు తరలిస్తున్న ఈడీ అధికారులు
ఈడీ కార్యాలయం, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీగా భద్రత
పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు
-
2024-03-16T11:03:38+05:30
ఇదే కేసులో కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కాగా ఆయకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. జడ్జి అనుమతితో కేజ్రీవాల్ కోర్టు నుంచి వెళ్లిపోయారు.
-
2024-03-16T11:01:08+05:30
-
2024-03-16T10:56:55+05:30
ఈ రోజు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అనంతరం కోర్టు ముందు హాజరు.
-
2024-03-16T10:50:52+05:30
Kavith Arrest live Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులుమరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు.