Kavitha Arrest - ED: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై సంచలన ప్రెస్‌నోట్ విడుదల చేసిన ఈడీ
ABN , Publish Date - Mar 18 , 2024 | 06:06 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎంఎల్సీ కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో సోదాలు నిర్వహించామని వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎంఎల్సీ కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటిఃవరకు 15 మందిని అరెస్ట్ చేశామని, మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడించింది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని వివరించింది.
రూ.100 కోట్లను చేర్చడంలో కవితది కీలక పాత్ర
ఈ నెల 23 వరకు కవితకు న్యాయస్థానం రిమాండ్ విధించిందని ఈడీ పేర్కొంది. కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించాని ప్రకటనలో తెలిపింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ఈడీ ప్రకటించింది. రూ.100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి ఎంఎల్సీ కవిత కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైందని వివరించింది. అనుమతుల కోసం ఆప్ నేతలకు ఆమె రూ.100 కోట్లు చేరవేశారు. అవినీతి, కుట్రల ద్వారా చిన్న వ్యాపారుల నుంచి డబ్బుని సేకరించి ఆప్ నేతలకు చేరవేశారని అని ఈడీ వివరించింది.
ఈ కేసులో ఇప్పటివరకు 1 ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, 5 అనుబంధ ఫిర్యాదులను దాఖలు చేశామని ఈడీ వివరించింది. 24 జనవరి 2023 నుంచి 03 జులై 2023 మధ్యకాలంలో రూ.128.79 కోట్లను తాత్కాలికంగా అటాచ్ చేశామని వెల్లడించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది.