Share News

Zaheerabad: ఇనుప ర్యాక్‌ల మంచం మీద పడి..ఐదో తరగతి విద్యార్థి మృతి

ABN , Publish Date - Nov 03 , 2024 | 05:03 AM

ప్రైవేటు స్కూల్‌కు అనుబంధంగా ఉన్న ఓ హాస్టల్‌లో ర్యాక్‌లతో కూడిన మంచం మీద పడి ఐదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో జరిగింది.

Zaheerabad: ఇనుప ర్యాక్‌ల మంచం మీద పడి..ఐదో తరగతి విద్యార్థి మృతి

జహీరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు స్కూల్‌కు అనుబంధంగా ఉన్న ఓ హాస్టల్‌లో ర్యాక్‌లతో కూడిన మంచం మీద పడి ఐదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో జరిగింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన సాత్విక్‌(12) జహీరాబాద్‌లోని సెవెంత్‌డే అడ్వెంటిస్టు ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్‌లోనే విద్యార్థి ఉంటున్నాడు.


శనివారం ఉదయం సాత్విక్‌ ఇనుప ర్యాక్‌లతో ఉండే మంచంపై నుంచి దిగుతూ ముందుకు బోర్లా పడ్డాడు. అదే సమయంలో మూడు ర్యాక్‌ల మంచం కూడా అతడిపై పడింది. తీవ్ర గాయాలైన సాత్విక్‌ను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

Updated Date - Nov 03 , 2024 | 05:03 AM