Share News

Malvi Malhotra: లావణ్యపై సినీ నటి మాల్వి మల్హోత్రా ఫిర్యాదు

ABN , Publish Date - Jul 10 , 2024 | 08:27 AM

హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల వివాదం ముదిరి పాకన పడుతోంది. ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకుంటున్నారు. తాజాగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య అనుచిత సందేశాలను పంపుతోందని మాల్వి ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని తెలిపింది.

Malvi Malhotra: లావణ్యపై సినీ నటి మాల్వి మల్హోత్రా ఫిర్యాదు

హైదరాబాద్: హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల వివాదం ముదిరి పాకన పడుతోంది. ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకుంటున్నారు. తాజాగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య అనుచిత సందేశాలను పంపుతోందని మాల్వి ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని తెలిపింది. మల్హోత్రా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తొలుత రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ కోకాపేటకి చెందిన లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగక రాజ్ తరుణ్.. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకుని తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ నానా రచ్చ చేసింది.


ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్.. లావణ్యతో కొంతకాలం పాటు కలిసున్న మాట వాస్తవమేనని.. మూడేళ్లుగా ఆమెతో ఎలాంటి సంబంధమూ లేదని తెలిపాడు. లావణ్యకు డ్రగ్స్, మందు అలవాట్లున్నాయని.. ఆమె టార్చర్ భరించలేకే విడిపోయానని స్పష్టం చేశాడు. ఆమె చాలా మందిని ఇలానే బ్లాక్ మెయిల్ చేస్తోందని.. గత ఏడాది కూడా తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఒకరిపై ఫిర్యాదు చేసిందని.. దాని తాలుకు ఎఫ్ఐఆర్ కాపీని సైతం చూపించాడు. తనకు మాల్వికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. మాల్వి కూడా లావణ్య ఎవరో తనకు తెలియదని.. రాజ్ తరుణ్ కేవలం తనకు కో స్టార్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. లావణ్య తనను బెదిరిస్తోందని.. అసభ్యకరంగా దుర్భాషలాడుతోందని వెల్లడించింది.

Updated Date - Jul 10 , 2024 | 10:43 AM