Anurag Thakur: రాజకీయాలు వద్దు.. సామరస్యంగా పరిష్కరించుకోవాలి
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:32 AM
సినీ పరిశ్రమతో ఏవైనా సమస్యలు ఎదురైతే రాజకీయాలు చేయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
అర్జున్ వివాదంపై అనురాగ్ ఠాకూర్
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : సినీ పరిశ్రమతో ఏవైనా సమస్యలు ఎదురైతే రాజకీయాలు చేయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కేజీఎఫ్ వంటి చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును, చిరంజీవి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారని గుర్తుచేశారు. సినీ పరిశ్రమతో ఏవైనా సమస్యలు వస్తే రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారు. వారిపై ఆ పార్టీకి నియంత్రణ లేదా? అని ప్రశ్నించారు.