FGG : ఎన్నికల ఖర్చుపై ఆడిటింగ్ చేయించాలి
ABN , Publish Date - Jun 26 , 2024 | 03:14 AM
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్(ఈసీ)కు భారీ స్థాయిలో రూ.622 కోట్లు ఖర్చు కావడంపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) అనుమానం వ్యక్తం చేసింది.
ప్రధాన ఎన్నికల అధికారికి రాసిన లేఖలో ఎఫ్‌జీజీ
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్(ఈసీ)కు భారీ స్థాయిలో రూ.622 కోట్లు ఖర్చు కావడంపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నికల వ్యయంపై ఆడిటింగ్ ఉండదు కాబట్టి అధికార యంత్రాంగం నిధులను దుర్వినియోగం చేసి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చుపై రాష్ట్ర ఆడిటర్ జనరల్‌తో ఆడిటింగ్ చేయించాలని కోరింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)కి మంగళవారం లేఖ రాశారు. ఆడిటింగ్ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా రూ.701కోట్లు ఖర్చు అయ్యాయని, ఎన్నికల ఖర్చుపై అప్పుడే వివరాలు కోరామని, జవాబు రాలేదని గుర్తు చేశారు.