Gajjela Kantam: మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న కేటీఆర్..
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:53 AM
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్(KTR) మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్జెల కాంతం(Gajjela Kantam) విమర్శించారు.
హైదరాబాద్: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్(KTR) మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్జెల కాంతం(Gajjela Kantam) విమర్శించారు. రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో గజ్జెల కాంతం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజెపీ తీసుకొచ్చిన అన్ని చట్టాలకు మద్దతు ఇచ్చిన బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రె్‌సను విమర్శించడం విడ్డూరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని.. ప్రధానిని ఒక ముఖ్యమంత్రి పెద్దన్న అంటే తప్పేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్థి కోసమే సీఎంగా రేవంత్‌రెడ్డి, పీఎం మోదీకి వినతిపత్రాలు ఇచ్చారన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటమి భయం పట్టుకుందని అందుకే బీఎస్పీతో సైతం పొత్తుకు సిద్థపడుతున్నారని విమర్శించారు.