Share News

Hyderabad: ఆలయ భూములకు జియో ట్యాగ్‌!

ABN , Publish Date - May 21 , 2024 | 04:49 AM

రాష్ట్రంలో ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే ఆలయ భూముల్ని ఆధునిక పద్దతిలో రికార్డు చేసేందుకు సిద్ధమైంది. సర్వే జరిపి వాటిని జియో ట్యాగ్‌తో పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఆలయ భూముల జియో ట్యాగింగ్‌, ఫెన్సింగ్‌,

Hyderabad: ఆలయ భూములకు జియో ట్యాగ్‌!

  • దేవాదాయశాఖపై నేడు మంత్రి సమీక్ష

హైదరాబాద్‌, మే 20(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే ఆలయ భూముల్ని ఆధునిక పద్దతిలో రికార్డు చేసేందుకు సిద్ధమైంది. సర్వే జరిపి వాటిని జియో ట్యాగ్‌తో పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఆలయ భూముల జియో ట్యాగింగ్‌, ఫెన్సింగ్‌, ధరణి రికార్డుల్లో భూముల వివరాల నమోదు తదితర అంశాలపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. తెలంగాణలో ఆలయాలకు ఉన్న మొత్తం భూములు, వాటి జియో ట్యాగింగ్‌పై చర్చించనున్నారు.

భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... ఆయా జిల్లాల పరిధిలోని ఆలయాల భూములపై రికార్డులు దేవాదాయశాఖ ఆధీనంలోనే ఉన్నాయా ? ఆ భూములను ఎవరైనా ఆక్రమించుకున్నారా? ఒకవేళ ఆక్రమించుకుంటే తిరిగి రాబట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. భక్తులు తమ ఇష్టదైవానికి ఆన్‌లైన్‌లో డొనేషన్లు సమర్పించేందుకు, ఎంపిక చేసిన ఆలయాల్లో సేవా టికెట్లు పొందేందుకు కామన్‌ పోర్టల్‌ ఏర్పాటుపై చర్చిస్తారు.

Updated Date - May 21 , 2024 | 04:49 AM