Share News

TG Govenrnment: హైదరాబాద్‌లో భారీ వర్ష సూచనలపై ప్రభుత్వం హైఅలెర్ట్..

ABN , Publish Date - Jul 16 , 2024 | 12:40 PM

హైదరాబాద్‌లో భారీ వర్ష సూచనలపై ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

TG Govenrnment: హైదరాబాద్‌లో భారీ వర్ష సూచనలపై ప్రభుత్వం హైఅలెర్ట్..

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్ష సూచనలపై ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షం కురిసినప్పుడు నీళ్ళు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి నీళ్ళు వెంటనే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పొన్నం సూచించారు.


గతం వర్షం కారణంగా ఇబ్బంది పడిన ప్రాంతాల్లోని ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని పొన్నం తెలిపారు. పాత భవనాల వద్ద ఉన్నవారిని ఖాళీ చేయించాలని సూచించారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. వర్షాలు కురిసినపుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండేలా విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ , హెచ్ఎండీఏ వివిధ విభాగాల అధికారులు ప్రజలు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని పొన్నం సూచించారు.

ఇవి కూడా చదవండి...

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..!

CM Revanth: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 12:41 PM