Bhatti Vikramarka: క్లీన్.. గ్రీన్ ఎనర్జీ పాలసీపై 3న వాటాదారులతో భేటీ
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:11 AM
తెలంగాణ క్లీన్.. గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2024పై జనవరి 3వ తేదీన వాటాదారులతో భేటీ నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి: భట్టి
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ క్లీన్.. గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2024పై జనవరి 3వ తేదీన వాటాదారులతో భేటీ నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. దీనిపై చర్చించడానికి వీలుగా వాటాదారులతో భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు.
రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల రానున్న ఏళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగనున్న నేపథ్యంలో.. పర్యావరణానికి మేలు చేసే ఇంధన వినియోగాన్ని పెంచేలా క్లీన్.. గ్రీన్ ఎనర్జీ పాలసీకి తుదిరూపు ఇవ్వనున్నామని తెలిపారు. జనవరి 3న జరిగే సమావేశంలో విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని భట్టి వెల్లడించారు.