Share News

Harish Rao: అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందం మాటేంటి?

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:44 AM

‘‘తెలంగాణకు చెందిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వెనక్కు ఇవ్వాలని నిర్ణయించావ్‌.. మరి దావోస్‌లో ఆయనతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందం మాటేంటి రేవంత్‌రెడ్డీ?’’ అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

Harish Rao: అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందం మాటేంటి?

  • రేవంత్‌రెడ్డీ సమాధానం చెప్పు

  • కాంగ్రె్‌సవన్నీ అసత్య ప్రచారాలు:హరీశ్‌

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ‘‘తెలంగాణకు చెందిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వెనక్కు ఇవ్వాలని నిర్ణయించావ్‌.. మరి దావోస్‌లో ఆయనతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందం మాటేంటి రేవంత్‌రెడ్డీ?’’ అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘రాహుల్‌ గాంధీ అదానీ అవినీతిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న సమయంలో దావో్‌సలో ఒప్పందం, రాష్ట్రంలోని డిస్కంలను అదానీకి అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల సంగతి చెప్పాలి’ అంటూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఆయన నిలదీశారు. అదానీతో రేవంత్‌రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నారని, ఇప్పుడు ఆయన అవినీతి బయట పడగానే మాట మార్చారని ఆరోపించారు.


తెలంగాణ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. కాగా, విజయోత్సవాల పేరిట గ్రామాల్లో కాంగ్రెస్‌ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారన్నారు. ప్రజల్లో కాంగ్రె్‌సకు ఎదురవుతున్న పరిస్థితి చూస్తుంటే.. కొందరిని కొన్నిసార్లు మోసం చేసినా.. అందరినీ అన్నిసార్లూ మోసం చేయలేమన్న అబ్రహాం లింకన్‌ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని హరీశ్‌ విమర్శించారు. కాగా, వాంకిడి గురుకుల విద్యార్థిని శైలజ మృతికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణమని, సర్కారు నిర్లక్ష్యానికి బలైన ఆ విద్యార్థినికి కన్నీటి నివాళి అంటూ.. హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక ప్రాణాలు బలితీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రె్‌సను కచ్చితంగా వెంటాడుతుందని ఎక్స్‌వేదికగా ఆయన పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 26 , 2024 | 03:44 AM