Share News

Harish Rao: వరద బాధితులకు తక్షణ సాయమందించండి

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:31 AM

వరద బాధితులందరికీ తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు లేఖ రాశారు.

Harish Rao: వరద బాధితులకు తక్షణ సాయమందించండి

  • సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వరద బాధితులందరికీ తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు లేఖ రాశారు. ‘ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌తో పాటు పలు జిల్లాల్లో వరద ఉధృతి బీభత్సాన్ని సృష్టించింది. అధికారిక లెక్కల ప్రకారం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.5,438 కోట్ల ఆస్తి నష్టం, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.


మృతుల కుటుంబాలకు రూ.25లక్షలకు తగ్గకుండా సాయం చేయాలి. పూర్తిగా ఇళ్లు కొట్టుకుపోయిన వారికి రూ.10లక్షల సాయం, పంట నష్టం కింద ఎకరాకు మీరు గతంలో డిమాండ్‌ చేసినట్లుగానే రూ.25వేల సాయం అందించాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, సింగరేణి కార్మికుల దసరా బోన్‌సను రాష్ట్ర ప్రభుత్వం బోగస్‌ చేసిందని హరీశ్‌ విమర్శించారు. కార్మికులకు రూ.1550కోట్లు రావాల్సి ఉండగా.. రూ.795 కోట్లతోనే సరిపెట్టిందని ధ్వజమెత్తారు.

Updated Date - Sep 22 , 2024 | 03:32 AM