Share News

Mohan Babu: మోహన్ బాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:29 PM

మోహన్ బాబు ఎక్కువ యాంగ్‌జైటీతో ఉన్నారని.. ఈ నేపథ్యంలో ఆయన బాగా కుంగి పోయి ఉన్నారని కాంటినెంటల్ హాస్పటల్ చైర్మన్ తెలిపారు. ఆయన ఎడమ కంటి కింద గాయం ఉందన్నారు. అయితే గుండె పరిసర ప్రాంతమంతా బాగానే ఉందని తెలిపారు. అనారోగ్యంతో గత రాత్రంతా ఆయనకు నిద్ర లేదని చెప్పారు.

Mohan Babu: మోహన్ బాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

హైదరాబాద్, డిసెంబర్ 11: టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఆరోగ్యంపై కాంటినెంటల్ హాస్పటల్‌ చైర్మన్ గురు ఎన్ రెడ్డి బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో కాంటినెంటల్ హాస్పటల్‌కు మోహన్ బాబు వచ్చినప్పుడు తీవ్ర ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు.


ఆయనకు రక్త పోటీ సైతం చాలా తీవ్రంగా ఉందన్నారు. ఆ సమయంలో 200కి పైగా బీపీ ఆయనకు ఉందని.. నేడు కూడా ఇంకా బీపీ అలాగే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన తీవ్ర మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఎక్కువ యాంగ్‌జైటీతో ఉన్నారని.. ఈ నేపథ్యంలో ఆయన బాగా కుంగి పోయి ఉన్నారని ఆసుపత్రి చైర్మన్ వివరించారు.


ఆయన ఎడమ కంటి కింద గాయం ఉందన్నారు. అయితే గుండె పరిసర ప్రాంతమంతా బాగానే ఉందని తెలిపారు. అనారోగ్యంతో గత రాత్రంతా ఆయనకు నిద్ర లేదని చెప్పారు. ఇక గతంలో ఆయనకు శస్త్ర చికిత్సలు జరిగాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యం ఆయన వేరే మెడిసిన్ తీసుకుంటున్నారని కాంటినెంటల్ హాస్పటల్ చైర్మన్ గురు ఎన్ రెడ్డి వివరించారు.


మొత్తం మీద ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం నిలకడగా లేదన్నారు. ఆయన శరీరంలో అంతర్గతంగా గాయాలున్నట్లు గుర్తించామని తెలిపారు. సిటీ స్కాన్ తీశామని వివరించారు. డిశ్చార్జ్ చేసేందుకు రెండు రోజులు పట్టే అవకాశముందన్నారు. అయితే మోహన్ బాబు కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని చైర్మన్ గురు ఎన్ రెడ్డి వివరించారు.


ప్రస్తుతం మోహన్ బాబుకు అత్యవసర సేవా విభాగంలో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లతోపాటు ఇతర వైద్య నిపుణుల బృందం మోహన్ బాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని ఆసుపత్రి చైర్మన్ గురు ఎన్ రెడ్డి వివరించారు. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

For Telaganga News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 12:47 PM