Home » Mohan Babu
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన వివాదం చల్లారడం లేదు. జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ బుధవారం ధర్నాకు దిగారు.
Mohan Babu Family Dispute: మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాస్త సర్దుమణిగిందని అంతా భావిస్తున్న సమయంలో మనోజ్ ఆందోళనతో ఆ ఇంట్లో గొడవలు మరోసారి బయటపడ్డాయి.
హైదరాబాద్‌లోని ఆస్తి విషయమై కొన్ని రోజులుగా తప్పుడు వార్తలు వస్తున్నాయని ప్రముఖ సినీ నటి సౌందర్య భర్త రఘు అన్నారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు.
సినీ నటి సౌందర్య చనిపోవడానికి ముందు ఏం జరిగింది. కర్ణాటకకు నుంచి ఆమె ఎక్కడకు బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన ఎంతసేపటికి ఆమె మరణించారు.
దర్శక, నిర్మాత, సినీనటుడు మంచు మోహన్ బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. తిరుపతిలోని ఆయన విద్యా సంస్థ సమీపంలో ఉన్న రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నవాళ్లు హోటల్ వద్దకు చేరుకున్నవారిపై కూడా బౌన్సర్లు దాడికి యత్నించారు.
సినీ నటుడు, దర్శక, నిర్మాత.. డైలాగ్ కింగ్ మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన ధర్మాసం ఈ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Manchu Family Disputes: మంచు ఫ్యామిలీ మధ్య ఘర్షణలు తగ్గనున్నాయా.. వివాదాలకు పరిష్కారం వెతికేందుకు మంచు మనోజ్ ఒక అడుగు ముందుకేశారా.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇంట్రస్ట్ పెంచుతోంది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
తిరుపతిలో మోహన్‌బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కాలేజీకి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసివేసి ఎవరినీ లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. మీడియాను కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది. మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు.
జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇవాళ(సోమవారం) మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది.
Telangana: మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది జల్పల్లి అటవీప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబు వద్ద పనిచేసే మేనేజర్ కిరణ్‌పైనే ప్రధాన ఆరోషణలు ఉన్నాయి.