Share News

Rain Alert: ఇవాళ కూడా అతి భారీ వర్షాలు.. బాంబ్ పేల్చిన ఐఎండీ

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:32 AM

కనివినీ ఎరుగని రీతిలో గత రెండు రోజులుగా వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కాలనీలకు కాలనీలే వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి.

Rain Alert: ఇవాళ కూడా అతి భారీ వర్షాలు.. బాంబ్ పేల్చిన ఐఎండీ

ఢిల్లీ: కనివినీ ఎరుగని రీతిలో గత రెండు రోజులుగా వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కాలనీలకు కాలనీలే వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. నదులు, ఏరులు, వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల వాసులు పూర్తిగా పునరావాస కేంద్రాలకు చేరారు. సమయానికి ఆహారం, నీరు, నిద్ర అన్నీ కరువై అలమటిస్తున్నారు.


ఈ తరుణంలో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ బాంబ్ పేల్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా మహారాష్ట్రలోని విదర్భలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలోనే విదర్భకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వెస్ట్ మధ్యప్రదేశ్, మరాఠవాడ, తెలంగాణ, గుజరాత్ అస్సాం మేఘాలయలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వెస్ట్ మధ్యప్రదేశ్, మరాఠవాడ, తెలంగాణ , గుజరాత్, అస్సాం, మేఘాలయకు ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

Updated Date - Sep 02 , 2024 | 11:32 AM