Share News

Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి..

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:59 AM

రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. నేడు ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. పన్నుల నుంచి తెలంగాణకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు.

Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి..

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. నేడు ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. పన్నుల నుంచి తెలంగాణకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివని.. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారన్నారు.


ఫలితంగా కేంద్ర ప్రాయోజిక పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలు కనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించాలని భట్టి కోరారు. తెలంగాణ రాష్ట్రం కీలక దశలో ఉన్నదని... వేగంగా అడుగులు వేస్తోందన్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 6.85 లక్షల కోట్లకు పైగా రుణపాఠంతో సతమతం అవుతున్నదన్నారు. సెస్‌లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలన్నారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదని పేర్కొన్నారు.


సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు. ఇది తెలంగాణ డిమాండ్ కాదని.. అన్ని రాష్ట్రాలకు సంబంధించినదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని... చారిత్రిక కారణాల వల్ల అసమాన అభివృద్ధి ఇక్కడ ఉన్నదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందని వెల్లడించారు. ఇలాంటి అసమానతల మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందన్నారు. సమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Updated Date - Sep 10 , 2024 | 11:59 AM

News Hub