Ex Mla Shakeel: సాహిల్‌పై లుక్ అవుట్ నోటీసులు సస్పెండ్
ABN , Publish Date - Apr 04 , 2024 | 05:50 PM
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌కు హైకోర్టులో కాస్త ఊరట కలిగింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టి పారిపోయిన కేసులో సాహిల్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు రద్దు చేయాలని సాహిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నోటీసులు రద్దు చేస్తే భారతదేశానికి వచ్చి విచారణకు సహకరిస్తానని సాహిల్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Shakeel) కుమారుడు సాహిల్‌కు (Sahil) హైకోర్టులో కాస్త ఊరట కలిగింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టి పారిపోయిన కేసులో సాహిల్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు రద్దు చేయాలని సాహిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నోటీసులు రద్దు చేస్తే భారతదేశానికి వచ్చి విచారణకు సహకరిస్తానని సాహిల్ స్పష్టం చేశారు. సాహిల్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. లుక్ అవుట్ నోటీసులు సస్పెండ్ చేసింది. ఈ నెల 19వ తేదీ లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి:
Bandi Sanjay: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం