Share News

Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ వద్ద టెన్షన్.. టెన్షన్.. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:38 AM

ఖైరతాబాద్ గణేష్ వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం చోటు చేసుకుంది. 70 ఏళ్ల ఖైరతాబాద్ గణేశ్ చరిత్రలో తొలిసారిగా అవంతరాలు ఎదురవుతున్నాయి.

Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ వద్ద టెన్షన్.. టెన్షన్.. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం చోటు చేసుకుంది. 70 ఏళ్ల ఖైరతాబాద్ గణేశ్ చరిత్రలో తొలిసారిగా అవంతరాలు ఎదురవుతున్నాయి. గణేష్ విగ్రహ తయారీ పనులు ముందుకు సాగడం లేదు. ప్రతి ఏటా వంద రోజుల ముందు నుంచే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులు ప్రారంభమవుతాయి. ఈసారి ఉత్సవ కమిటీ రెండు వర్గాలుగా చీలి పోయింది. ఈ వర్గపోరు కారణంగా పాత కమిటీ, కొత్త కమిటీల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో 36 రోజుల పాటు విగ్రహ పనులు నిలిచిపోయాయి.


తమకు సమాచారం ఇవ్వకుండానే కొత్త కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఉత్సవ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ చైర్మన్ సుదర్శన్ తర్వాత గత ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ఆయన కుమారుడు సుదర్శన్ నిర్వహించారు. ఈ ఏడాది సింగారి కుటుంబాన్ని పక్కనబెట్టి తామే ఉత్సవ పనులను చూస్తామని స్థానికులు అంటున్నారు. ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ వివాదాన్ని సరిదిద్దేందుకు దానం నాగేందర్ రంగంలోకి దిగారు. ఆయన అధ్యక్షతన రెండు కమిటీల సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

CM Revanth Reddy: రేపు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో రేవంత్ సమావేశం..

Read more Telangana News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 11:39 AM