Share News

Hyderabad : నీట్‌ అక్రమాలను నిరసిస్తూ 4న విద్యాసంస్థల బంద్‌

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:15 AM

నీట్‌ అక్రమాలకు నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఈనెల 4న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.

Hyderabad : నీట్‌ అక్రమాలను నిరసిస్తూ 4న విద్యాసంస్థల బంద్‌

  • విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): నీట్‌ అక్రమాలకు నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఈనెల 4న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, పార్లమెంటులో చర్చకు విపక్షాలు పట్టు పడుతున్నా ప్రధాని మోదీకి చీమ కుట్టినట్లుగా కూడా లేదని, అందుకే బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సమితి ప్రకటించింది.

ఈ మేరకు మంగళవారం టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో విదార్థి, యువజన సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఎన్‌ఎ్‌సయూఐ(నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా) రాష్ట్ర అద్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. పోటీ పరీక్షల నిర్వహణలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీయే) విఫలమైందన్నారు.

పదేళ్ల మోదీ పాలనలో 70 పరీక్ష పేపర్లు లీక్‌ అయ్యాయని, లీకేజీలు జరుగుతున్న రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడంతో మోదీ మౌనంగా ఉంటున్నారన్నారు. యువ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ సలీమ్‌ పాషా మాట్లాడుతూ.. నీట్‌ లీకేజీపై సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని, కాబట్టి సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 4న తలపెట్టిన బంద్‌కు ప్రజల మద్దతు కోరారు. రాష్ట్రాలకే మెడికల్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో స్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌, పీవైఎల్‌, డీవైఎ్‌ఫఐ, పీడీఎ్‌సయూ, ఏఐవైఎఫ్‌ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 09:01 AM