Share News

TS News: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో హ్యూమన్ ట్రాఫిక్ పోలీసుల దాడి

ABN , Publish Date - Aug 18 , 2024 | 11:22 AM

నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలుగవ రోడ్‌లో సెలూన్‌పై హ్యూమన్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. సెలూన్, స్పా ముసుగులో నిర్వహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

TS News: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో హ్యూమన్ ట్రాఫిక్ పోలీసుల దాడి

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలుగవ రోడ్‌లో సెలూన్‌పై హ్యూమన్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. సెలూన్, స్పా ముసుగులో నిర్వహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగవ రోడ్డులో ఉన్న సెంటర్‌పై శనివారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.


గచ్చిబౌలిలో పోకిరీల హల్‌చల్..

గచ్చిబౌలిలో అర్ధ రాత్రి పోకిరీలు హల్‌చల్ చేశారు. పబ్‌లో ఇరువర్గాలు మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. మద్యం మత్తులో యువతిని వేధించారని ఆరోపణలు వస్తు్న్నాయి. అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి యువకులు ఘర్షణ పడ్డారు.


కిరాణా షాప్‌లో ఎస్‌వోటీ తనిఖీలు..

మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్‌లో ఉన్న కోమల్ కిరాణా షాప్‌లో మేడ్చల్ ఎస్‌వోటీ తనీఖీలు చేశారు. గత 6 నెలలుగా వినియోగదారులకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పివేష్ పాండే(32)ను అరెస్ట్ చేసినట్టు వివరించారు. అతడి నుంచి 200 గంజాయి చాక్లెట్ల స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పేట్ బాషీరాబాద్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు.


హబ్సిగూడ యాక్సిడెంట్ కేసులో డ్రైవర్ అరెస్ట్

హబ్సిగూడ రోడ్డు యాక్సిడెంట్ కేసులో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లారీ డ్రైవర్ సూరజ్ సింగ్‌ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న (శనివారం) ఉదయం హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టడంతో 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థినీ ఈ ప్రమాదంలో మృత్యువాతపడింది. లారీ ఢీ కొట్టడంతో ఆటో ఓ బస్సు కిందకు వెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది. ఇక ప్రస్తుతం ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. లారీ డ్రైవర్ సురాజ్ సింగ్‌పై 106 బీఎన్‌ఎస్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Updated Date - Aug 18 , 2024 | 11:22 AM