Hyderabad: రాజాసింగ్‌ను చంపేస్తాం.. ఈ నెంబర్ల నుంచే బెదిరింపు కాల్స్..
ABN , Publish Date - May 29 , 2024 | 05:19 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ ఆగడంలేదు. పలు అంతర్జాతీయ నెంబర్ల నుంచి రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను ఆయన ట్విట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ ఆగడంలేదు. పలు అంతర్జాతీయ నెంబర్ల నుంచి రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ (Rajasingh) ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను ఆయన ట్విట్ చేశారు. బెదిరింపు కాల్స్ తనకు కొత్త కాదని.. గతంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఒక బాధ్యతగల పౌరుడిగా తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. గతంలోనూ రాజాసింగ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం ఆ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయంటూ రాజాసింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఏయే నెంబర్ల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయనే విషయాన్ని రాజాసింగ్ తెలిపారు.
Phone Tapping: ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
రాజాసింగ్‌కు వార్నింగ్
బెదిరింపు కాల్స్‌పై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బెదిరింపు కాల్స్‌పై చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది చూడాలన్నారు. ఈరోజు తనకు వరుసగా బెదిరింపు కాల్స్ వచ్చాయని.. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోందని రాజాసింగ్ వెల్లడించారు. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తన ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయన్నారు. వాటిపై.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని.. ఆయన ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలన్నారు.
బెదిరింపు ముఠాకు రేవంత్ నెంబర్
తనకు బెదిరింపు కాల్స్ రావడంపై రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. తనకు పదేపదే బెదిరింపు కాల్స్ వస్తున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తులు ఇంకా ఏవైనా నెంబర్లు ఉన్నాయా అని అడిగారని.. పోలీసుల తీరును నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చానని రాజాసింగ్ చెప్పారు. రేవంత్‌కు బెదిరింపు కాల్ వస్తే.. అప్పుడైనా సరైన రీతిలో విచారణ జరుగుతుందని భావించి సీఎం నెంబర్ ఇచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు.
Praneeth Rao: ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News