Share News

Hyderabad: 27 వారాలకే ప్రసవం.. శిశువు బరువు 560 గ్రాములే!

ABN , Publish Date - May 24 , 2024 | 10:25 AM

పేగు బంధం తెంచుకుని 27 వారాలకే తక్కువ బరువుతో పుట్టిన ఓ నవజాత శిశువుకు నిలోఫర్‌ వైద్యులు(Nilofer Doctors) 52 రోజుల పాటు చికిత్స అందించి తల్లికి ఆరోగ్యంగా అందించారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ముస్కాన్‌(Muskan)కు 27 వారాలకే ప్రసవం అయింది.

Hyderabad: 27 వారాలకే ప్రసవం.. శిశువు బరువు 560 గ్రాములే!

- 52 రోజుల చికిత్సతో చిన్నారిని సాధారణస్థితికి తెచ్చిన నిలోఫర్‌ వైద్యులు

హైదరాబాద్‌ సిటీ: పేగు బంధం తెంచుకుని 27 వారాలకే తక్కువ బరువుతో పుట్టిన ఓ నవజాత శిశువుకు నిలోఫర్‌ వైద్యులు(Nilofer Doctors) 52 రోజుల పాటు చికిత్స అందించి తల్లికి ఆరోగ్యంగా అందించారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ముస్కాన్‌(Muskan)కు 27 వారాలకే ప్రసవం అయింది. పుట్టిన సమయంలో శిశువు బరువు కేవలం 560 గ్రాములు మాత్రమే ఉండడంతో మూడు గంటల తర్వాత శ్వాసకోశ సమస్య ఉత్పన్నమైంది. దీంతో శిశువును నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ చిన్నారికి రెస్పిరేటరీ డిసెస్‌ సిండ్రోమ్‌ (ఆర్‌డీఎస్‌) ఉన్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందించడంతో పాటు శ్వాస మెరుగుదల కోసం సీపాప్‌ అమర్చారు.

ఇదిరూడా చదవండి: Hyderabad: వరదనీటిలో మహిళ నిరసన..


అనంతరం చిన్నారి తగినంత బరువు పెరగడం కోసం తల్లి ఒడిలో చేర్చి కంగారో మదర్‌ కేర్‌ సేవలు పొందే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు చిన్నారికి అన్ని పోషక పదార్థాలు అందించారు. ప్రీ మెచ్యూరిటీ రక్త హీనతకు ఎర్రరక్తకణాల మార్పిడీ చేశారు. ప్రీ మెచ్యూరిటీ రెటినోపతి ప్లస్‌ వ్యాధి దృష్ట్యా యాంటీ వీఈజీఎఫ్‌ ఇంట్రావిట్రియల్‌ ఇంజక్షన్‌ ఇచ్చారు. దాదాపు 52 రోజుల పాటు చికిత్సలు అందించగా శిశువు బరువు 1.460 కిలోలకు పెరిగి ఆరోగ్యంగా ఉండటంతో గురువారం చిన్నారిని డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి తోట తెలిపారు. శిశువుకు చికిత్స అందించిన ఆస్పత్రి వైద్యులను ఆమె అభినందించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 24 , 2024 | 10:27 AM