Miyapur Police: ద్విచక్ర వాహనాల చోరీ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
ABN , Publish Date - Sep 02 , 2024 | 06:19 PM
హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీ చేస్తున్న ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు సోమవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 02: హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీ చేస్తున్న ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు సోమవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 16 ద్విచక్ర వాహనాలతోపాటు 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాటి విలువ రూ. 15 లక్షల ఉంటుందని వారు వివరించారు.
Also Read: Uttar Pradesh: గజ ఈతగాడి దురాశకు నిండు ప్రాణం బలి
మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేటకు చెందిన షేక్ అబు తాలిం ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ముఠాలో ఓ వ్యక్తి తప్పించుకున్నాడని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఈ ముఠాపై 18 పోలీసు కేసులు నమోదయ్యాయని తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన వీరంతా ఓ ముఠాగా ఏర్పడి.. ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు.
Also Read:Toopran: గురుకుల పాఠశాలలో మళ్లీ విద్యార్థుల మధ్య ఘర్షణ
హైదరాబాద్‌లోని వివిధ షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీ చేస్తున్నట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించారన్నారు. ఇటీవల మహానగరంలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. దీంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో నగరంలోని వివిధ మెట్రో స్టేషన్ల వద్ద మఫ్టీలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. అందులోభాగంగా సోమవారం ఆ ముఠా పోలీసుల చేతికి చిక్కింది.
Also Read: Heavy Rains: ఉన్నతాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్ కీలక సమీక్ష
Read Latest Telangana News And Telugu News