Hyderabad : కలరాకు ఓరల్ టీకా
ABN , Publish Date - Aug 28 , 2024 | 04:05 AM
వ్యాక్సిన్ దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తాజాగా కలరాకు ఓరల్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘హిల్‌కాల్’ పేరుతో మంగళవారం అధికారికంగా విడుదల చేసింది.
హిల్‌కాల్ పేరుతో విడుదల.. 14 రోజుల
వ్యవధిలో 2 సార్లు తీసుకుంటే చాలు
20 కోట్ల టీకాల ఉత్పాదక సామర్థ్యం
భారత్ బయోటెక్ ఈసీ కృష్ణ ఎల్లా వెల్లడి
కలరాకు ఓరల్ టీకా
హిల్‌కాల్ పేరుతో అందుబాటులోకి
తీసుకువచ్చిన భారత్ బయోటెక్
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సిన్ దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తాజాగా కలరాకు ఓరల్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘హిల్‌కాల్’ పేరుతో మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టీకాను 14 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకోవాల్సిఉంటుంది. ఏడాది వయసు దాటిన పిల్లలు మొదలు.. వృద్ధుల వరకు అందరూ దీన్ని తీసుకోవచ్చు.
అమెరికాకు చెందిన హిల్లేమాన్ లాబొరేటరీస్ వారి నుంచి లైసెన్స్ తీసుకుని.. దీన్ని అభివృద్ధి చేశారు. టీకా ఆవిష్కరణ సందర్భంగా భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 4.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉందని, రాబోయే కొద్ది నెలల్లో భువనేశ్వర్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. దాంతో.. 20 కోట్ల డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం తమకు ఉంటుందన్నారు. ‘‘2030 నాటికి కలరా రహిత ప్రపంచమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పనిచేస్తోంది. మేము కూడా ఆ లక్ష్యంలో భాగస్వాములమవుతాం’’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 కోట్ల కలరా టీకాల డిమాండ్ ఉందని, అయితే.. 4 కోట్ల డోసుల లోటు కొనసాగుతోందని వివరించారు.