Share News

Hyderabad Metro: మెట్రో రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్.. పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం..

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:14 PM

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు మార్గం సుగమమైంది. రెండో దశ నిర్మాణానికి రాష్ట్రం ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. ఈ రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

Hyderabad Metro: మెట్రో రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్.. పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం..
Hyderabad Metro

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు మార్గం సుగమమైంది. రెండో దశ నిర్మాణానికి రాష్ట్రం ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. ఈ రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. మెట్రో రెండో దశకు అంచనా వ్యయం రూ. 24,269 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 7, 313 కోట్లు. హైదరాబాద్ మెట్రో మొదటి దశలో మూడు కారిడార్లలో కలుపుకుని మొత్తం 69 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. మొదటి దశ ప్రాజెక్టుకు రూ. 22 వేల కోట్లు ఖర్చైంది.


హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ కూడా అందుబాటులోకి వస్తే రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో దశ నిర్మాణ పనులు అయిదు కారిడార్లలో మొత్తం 76.4 కిలో మీటర్ల మేర జరగనున్నాయి. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పీపీపీ విధానంలో మెట్రో రెండో దశ పనులు జరగబోతున్నాయి. ఈ భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతం అంటే రూ. 7, 313 కోట్లు. కేంద్ర ప్రభుత్వం వాటు 18 శాతం అంటే 4,230 కోట్లు. మిగిలిన 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుతారు.


రెండో దశలో ప్రతిపాదించిన 5 కొత్త కారిడార్‌లు

నాలుగో కారిడార్

నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ)

అయిదో కారిడార్

రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలీస్ వరకు (11.6 కి.మీ)

ఆరో కారిడార్

ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు (7.5 కి.మీ)

ఏడో కారిడార్

మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు (13.4 కి.మీ)

ఎనిమిదో కారిడార్

ఎల్ బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.)

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 02 , 2024 | 06:14 PM