Hyderabad: 50 మంది నకిలీ వైద్యులు.. తనిఖీల్లో గుర్తించిన అధికారులు
ABN , Publish Date - May 24 , 2024 | 10:48 AM
తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్(IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు.
హైదరాబాద్ సిటీ: తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్(IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్(Antibiotics) ఇస్తున్నట్లు గుర్తించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: వరదనీటిలో మహిళ నిరసన..
తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడించారు. తనిఖీల్లో డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News