Share News

Hyderabad: ‘రంబుల్‌’.. పెయిన్‌ఫుల్‌.. స్ట్రిప్స్‌ ఏర్పాటుపై జనం ఆగ్రహం

ABN , Publish Date - Dec 27 , 2024 | 09:45 AM

వాహనాల వేగాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన సిల్వర్‌వైట్‌ స్ట్రిప్స్‌ (రంబుల్‌స్ట్రిప్స్‌ స్పీడ్‌ బ్రేకర్స్‌)ను అల్వాల్‌(Alwal)లోని అనేక ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రోడ్లపై ఇష్టానుసారంగా వేస్తున్నారు. దీంతో వాహనదారులు వెన్నెముక దెబ్బతిని బ్యాక్‌ పెయిన్‌తో బాధపడుతున్నారు.

Hyderabad: ‘రంబుల్‌’.. పెయిన్‌ఫుల్‌.. స్ట్రిప్స్‌ ఏర్పాటుపై జనం ఆగ్రహం

- బ్యాక్‌ పెయిన్‌తో ఇబ్బందులు

- ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేయాలని వేడుకోలు

హైదరాబాద్: వాహనాల వేగాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన సిల్వర్‌వైట్‌ స్ట్రిప్స్‌ (రంబుల్‌స్ట్రిప్స్‌ స్పీడ్‌ బ్రేకర్స్‌)ను అల్వాల్‌(Alwal)లోని అనేక ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రోడ్లపై ఇష్టానుసారంగా వేస్తున్నారు. దీంతో వాహనదారులు వెన్నెముక దెబ్బతిని బ్యాక్‌ పెయిన్‌తో బాధపడుతున్నారు. నిత్యం ట్రాఫిక్‌జామ్‌లతో ఇబ్బందులకు గురవుతున్న రోడ్లపై రంబుల్‌ స్ట్రిప్స్‌ వేయడం సరికాదని వాహనదారులు వాపోతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: ‘పట్ట’నంత నిర్లక్ష్యం.. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల పడిగాపులు


రంబుల్‌ స్ట్రిప్స్‌ వాహదారుల వేగాన్ని నియంత్రించి, ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఏర్పాటుచేశారు. అయితే పట్టణ, గ్రామీణప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌(Indian Road Congress) మార్గదర్శకాల ప్రకారం హైవేలు, ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో వాహనదారుల వేగాన్ని నియంత్రించడంలో భాగంగా రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులపై, రాష్ట్ర రహదారులపై నిబంధనల ప్రకారం రంబుల్‌ స్ట్రిప్స్‌ను వేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంటున్నారు.


కానీ ఎక్కడ పడితే అక్కడ పలు రోడ్లపై ఏర్పాటు చేయడంతో వాహనదారులు, ఆటోప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్లమీద స్పీడ్‌బ్రేకర్స్‌ తక్కువసైజ్‌లో ఉండేవి. ప్రస్తుతం సగం అడుగు( హాఫ్‌ ఫీట్‌)ఎత్తు వరకు ఉన్నాయని వాహదారుడు సునీల్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు రంబుల్‌ స్ట్రిప్స్‌తో ఇబ్బందులు మరోవైపు రోడ్లపై ఉన్న గుంతలతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు.


మార్గదర్శకాల ప్రకారం..

ఎత్తు 20 నుంచి 30 ఎంఎం(మిల్లిమీటర్‌), 200- 300 మిల్లిమీటర్ల వెడల్పు, ఒక మీటర్‌ గ్యాప్‌లో ఆరు సంఖ్యల మధ్య ఒక ప్రదేశంలో ఉండాలని మార్గదర్శకాల్లో చెబుతుండగా, రంబుల్‌ స్ట్రిప్స్‌ను మాత్రం ఇష్టానుసారంగా అవసరంలేని ప్రాంతాల్లో కూడా వేస్తున్నారు. దీంతో ప్రతి రోజు వాహనదారులు వెన్నునొప్పి, డిస్క్‌ వంటి సమస్యలతో తరుచూ బాధపడుతున్నారు. రామంతాపూర్‌ స్ట్రీట్‌నెంబర్‌-8 హబ్సిగూడ మార్గంలో ఒకే రోడ్డుపై పదుల సంఖ్యల్లో రంబుల్‌ స్ట్రిప్స్‌ వేశారు. దీంతో ముఖ్యంగా మహిళలు తీవ్రమైన బ్యాక్‌ పెయిన్‌తో బాధపడుతున్నారు.


అయితే పాఠశాలలు, నివాసాప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో వీటినేస్తే బాగుటుందని స్థానికులు సుధారావు సూచించాడు. ప్రజల నుంచి వసూలుచేస్తున్న పన్నులను ప్రజాల ఆరోగ్యంపై పడేవిధంగా చేయడం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు. రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేసే ముందు స్థానికంగా ప్రమాదాలు జరుగుతున్నాయా అని ఆలోచించి వేయాలని వాహనదారులు, ప్రయాణికులు పేర్కొంటున్నారు.

- రాజీవ్‌ రహదారి, సుచిత్ర, కొంపల్లి- బొల్లారం, అల్వాల్‌ లయోలా కళాశాల, తదితర ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా వేసిన రంబుల్‌ స్ట్రిప్స్‌ కారణంగా బయటకు వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు.


వెన్నుముకపై ప్రభావం.. పడకుండా ఏర్పాటు చేయాలి

వెన్నుముకపై ప్రభావం పడకుండా ఏర్పాటు చేయాలిఅవసరమున్న ప్రాంతాల్లో, నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌ మార్గదర్శకాల ప్రకారం రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయాలి.

- పరాంకుశం మాధవ్‌, మాజీ కౌన్సిలర్‌ అల్వాల్‌


వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) నిర్దేశించిన మార్గదర్శకాలకు భిన్నంగా అధిక మందంతో అధిక సంఖ్యలో అమర్చిన ప్రస్తుత రంబుల్‌ స్ట్రిప్స్‌లో సాంకేతిక పరమైన లోపాలను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి కూకట్‌పల్లి జోన్‌ పరిధిలో సర్కిళ్లవారీగా వేసిన రంబుల్‌ స్ట్రిప్స్‌పై సర్వే నిర్వహించాం. 15 మిల్లీమీటర్‌ ఉన్న వాటిని 5 మిల్లీమీటర్‌కు సరిచేస్తాం. అనవరంగా వేసిన ప్రాంతాల్లో పూర్తిగా తొలగిస్తాం.

- చిన్నారెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌


ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్‌

ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2024 | 09:45 AM