Hyderabad: 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా బంద్.. ఎందుకోసమంటే..
ABN , Publish Date - Nov 19 , 2024 | 06:38 AM
మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్ (Banjara Hills) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ గోపి(ADE Gopi) తెలిపారు.
హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్ (Banjara Hills) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ గోపి(ADE Gopi) తెలిపారు. 11కేవీ ఊడ్స్ అపార్ట్‌మెంట్, ఎల్వీ ప్రసాద్‌మార్గ్ ఫీడర్ల పరిధిలోని హుడా ఎంక్లేవ్, అశ్వినిలేఔట్, డీకేనగర్, ఎన్‌ఎండీసీ,హనుమాన్ టెంపుల్, పార్క్‌హయత్ వెనుక ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 11కేవీ బీఎన్‌ఆర్ హిల్స్, రోడ్ నంబర్ 14 ఫీడర్ల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 51(Jubilee Hills Road No. 51), 70, నందిహిల్స్, బీఎన్‌ఆర్ హిల్స్, సైలెంట్ వ్యాలీ పార్క్, హుడా ఎంక్లేవ్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఎమ్మెల్సీ కవిత ఇంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chakradhar Goud: హరీశ్ నా ఫోన్ ట్యాప్ చేయించాడు
గ్రీన్‌ల్యాండ్స్ పరిధిలో..
మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ(Greenland's ADE) పరిధిలోని 11 కెవి మెథడిస్ట్ కాలనీ, ఎన్‌ఆర్‌ఆర్ పురం ఫీడర్ల పరిధిలోని మెథడిస్ట్ కాలనీ, రైల్వే ట్రాక్ రోడ్, సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్, రాక్ గార్డెన్ పార్క్, ఎన్‌ఆర్‌ఆర్ పురం సైట్-1, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 11కేవీ గ్రీన్‌పార్క్ హోటల్, రాజీవ్‌నగర్ కాలనీ ఫీడర్ల పరిధిలోని గ్రీన్‌పార్క్ హోటల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కళ్యాణ్‌నగర్, రాజీవ్‌నగర్, బీఎస్‌పురి కాలనీ, సివెల్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రాంతం, జయంతినగర్, శ్రీరామ్‌నగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని ఏడీఈ చరణ్ సింగ్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ..
ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్ హయాంలో సర్వేతో దోపిడీ
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్ ప్రవర్తన
Read Latest Telangana News and National News