Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌కు రూ.60 కోట్ల నిధులు
ABN , Publish Date - Mar 09 , 2024 | 12:32 PM
అత్యాధునిక మైక్రోస్కోపీ పద్ధతులను ఉపయోగించి, వినూత్న పరిశోధనలు చేయడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీహెచ్)కు రూ.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
కంది(హైదరాబాద్): అత్యాధునిక మైక్రోస్కోపీ పద్ధతులను ఉపయోగించి, వినూత్న పరిశోధనలు చేయడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీహెచ్)కు రూ.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అధునాతన అనలిటికల్ టెక్నికల్ హెల్ప్ ఇనిస్టిట్యూట్స్ (సాతి) పథకం ద్వారా కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఈ నిధులను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సాతీ కార్యక్రమంలో ఐఐటీ-హెచ్ పరిశోధనలను అభినందిస్తూ డైరెక్టర్ బీఎస్ మూర్తికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ షీల్డ్‌ను బహూకరించారు. అనంతరం ఐఐటీ-హెచ్ పరిశోధనల కోసం నిధులను ప్రకటించారు.