Share News

Hyderabad: పారదర్శకంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష

ABN , Publish Date - Jun 06 , 2024 | 10:20 AM

టీజీపీఎ్‌ససీ ఆధ్వర్యంలో జూన్‌ 9న నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌(Additional Collector Patil Hemanta Keshav) అన్నారు.

Hyderabad: పారదర్శకంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష

- అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌

హైదరాబాద్‌ సిటీ: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జూన్‌ 9న నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌(Additional Collector Patil Hemanta Keshav) అన్నారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని సరోజినీనాయుడు వనిత మహా విద్యాలయంలోని సమావేశ మందిరంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, జాయింట్‌ కస్టోడియన్లతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్షకు సంబంధించిన మెటీరియల్‌ను చెక్‌లిస్ట్‌ ప్రకారం సరిచూసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న పరీక్షకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండాలని ఆదేశించారు.

ఇదికూడా చదవండి: Shamshabad: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..


అభ్యర్థుల బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌(Biometric Verification) క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 9.30 నుంచి విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవాలని, 10.25 నిమిషాలకు అభ్యర్థులకు క్వశ్చన్‌ పేపర్‌ ఇవ్వాలని సూచించారు. మధ్యాహ్నం 1.00 గంటలకు ఓఎంఆర్‌ షీట్లు అభ్యర్థుల నుంచి సేకరించాలని తెలిపారు. సమావేశంలో గ్రూప్‌-1 పరీక్షల నోడల్‌ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, జాయింట్‌ కస్టోడియన్స్‌, రీజనల్‌ కోఆర్డినేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 10:20 AM