Hyderabad: 20న నగరంలో నీటి సరఫరా బంద్
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:03 PM
నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 20న 24గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 20న 24గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్ - 1లో మిరాలం, అలియాబాద్ ఆఫ్ టేక్ ప్రాంతం వద్ద మరమ్మతులు చేయాల్సి ఉంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటిసరఫరాకు అంతరాయం కలగనుంది.