Share News

Hyderabad: వరదనీటిలో మహిళ నిరసన..

ABN , Publish Date - May 24 , 2024 | 09:59 AM

నాగోల్‌ డివిజన్‌ ఆనంద్‌నగర్‌(Anandnagar) చౌరస్తాలోని రోడ్డుపై వర్షం పడిన ప్రతిసారీ నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదనలో కుంట్లూర్‌కు చెందిన నిహారిక వరద నీటిలో బైఠాయించారు.

Hyderabad: వరదనీటిలో మహిళ నిరసన..

- రోడ్డును బాగు చేయాలని డిమాండ్‌

- అధికారుల హామీతో విరమణ

హైదరాబాద్: నాగోల్‌ డివిజన్‌ ఆనంద్‌నగర్‌(Anandnagar) చౌరస్తాలోని రోడ్డుపై వర్షం పడిన ప్రతిసారీ నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదనలో కుంట్లూర్‌కు చెందిన నిహారిక వరద నీటిలో బైఠాయించారు. ఈ సందర్భంగా తన ఆవేదనను ఇలా వెలిబుచ్చారు. ‘నాగోల్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. బైక్‌పై పిల్లలను తీసుకుని స్కూల్‌కు ఆనంద్‌నగర్‌ చౌరస్తా నుంచి కుంట్లూర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు కొనసాగిస్తాం. రోడ్డు గుంతలమయం కావడంతో తాము ఇప్పటికే రెండు, మూడుసార్లు కిందపడి గాయాలపాలయ్యాం.

ఇదికూడా చదవండి: Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్లపై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ


బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఇదే రోడ్డుపై వరదనీరు చేరడంతో విసుగెత్తి నిరసన తెలుపుతున్నా’ అని వివరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డును బాగుచేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిహారికకు సర్దిచెప్పి దీక్ష విరమించేందుకు యత్నించగా ఆమె ససేమిరా అన్నారు. రోడ్డు బాగుచేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని, కోడ్‌ ముగిసిన వెంటనే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేపడుతామని డిప్యూటీ కమిషనర్‌ తిప్పర్తి యాదయ్య వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 24 , 2024 | 09:59 AM