Share News

Mohan babu: హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు

ABN , Publish Date - Dec 11 , 2024 | 11:53 AM

Telangana: ప్రముఖ నటుడు మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్‌ని సవాలు చేస్తూ... హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

Mohan babu: హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
Actor Manchu Mohan babu

హైదరాబాద్, డిసెంబర్ 11: ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Actor Mohan babu) తెలంగాణ హైకోర్టును (Telangana Highcourt) ఆశ్రయించారు. తనకు పోలీసులు జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ... హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. తాను సెక్యూరిటీ కోరినప్పటికీ భద్రత కల్పించలేదని.. వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.

బొత్స గాలి తీసిన వైసీపీ కార్యకర్త..


మంచు కుటుంబంలో గొడవలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. మంచు ఫ్యామిలీలో రగడ తారాస్థాయికి చేరుకుంది. గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో మంటలు చర్చనీయాంశంగా మారాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య నెలకొన్న వివాదం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జన్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ తన భార్య సతీమణితో కలిసి రావడం.. అక్కడ వారిని రానీయకుండా మంచు విష్ణు ఏర్పాటు చేసిన బౌన్సర్లు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్ బౌన్సర్లు, మంచు విష్ణు ఏర్పాటు చేసిన బౌన్సర్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మంచు మనోజ్ ఎవరినీ లెక్క చేయకుండా గేట్లను బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లిపోయారు. ఆ తరువాత చిరిగిన చొక్కాతో ఆయన బయటకు వచ్చారు.

ఆ వివరాలన్నీ చెబుతా: మంచు మనోజ్


ఆ తరువాత బయటకు వచ్చిన మోహన్‌బాబు అక్కడి మీడియా ప్రతినిధుల‌ను చూసి ఊగిపోయారు. మీడియా ప్రతినిధుల మైక్‌ను లాగేశారు. ఈ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధికి ఫ్రాక్చర్ అవగా, పలువురికి గాయాలయ్యాయి. మీడియాపై జర్నలిస్టుల దాడిని జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే జన్‌పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మోహన్‌బాబు, మనోజ్‌ లైసెన్స్‌ గన్‌లను స్వాధీనం చేసుకొని, సీజ్‌ చేశారు. అలాగే నేడు (బుధవారం) విచారణకు రావాల్సింది మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌లకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు జన్‌పల్లి వద్ద జరిగిన ఘర్షణలో మోహన్‌ బాబు తలకు గాయమైంది. దీంతో ఆయనను పెద్ద కుమారుడు విష్ణు కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లి జాయిన్ చేశారు. ప్రస్తుతం మోహన్‌ బాబుకు చికిత్స కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

Kadapa: రాఘవరెడ్డి విచారణ.. ఎంపీ అవినాష్‌ మెడకు బిగుస్తున్న ఉచ్చు

సంచలన విషయాలు బయటపెట్టిన మనోజ్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 12:09 PM